- Advertisement -
పర్యవేక్షణకు మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో కమిటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ‘కుంభమేళా’ తరహాలో ఈ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పుష్కరాల నిర్వహణ , రోడ్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రి డి. శ్రీధర్ బాబు నేతృత్వంలో ఒక ప్రత్యేక క్యాబినెట్ సబ్-కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ గోదావరి పుష్కరాల నిర్వహణ కొరకు ఈ బడ్జెట్ లో 500 కోట్ల రూపాయలు వ్యయం కానున్నట్టు అంచనా వేసింది.
- Advertisement -



