Saturday, March 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపులిగుండల 'ఎకో-టూరిజం'లో..తొలి పక్షుల వీక్షణ నివాసం ఏర్పాటు

పులిగుండల ‘ఎకో-టూరిజం’లో..తొలి పక్షుల వీక్షణ నివాసం ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ-ఖమ్మం
వన్యప్రాణి సంరక్షణ, ఎకో-టూరిజాన్ని ప్రోత్సహించే దిశగా తెలంగాణ అటవీ శాఖ ముందడుగు వేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో సుందరమైన పులిగుండల ఎకో-టూరిజం ప్రదేశంలో తొలి పక్షుల స్థలాన్ని శుక్రవారం ఏర్పాటు చేసినట్టు డీఎఫ్‌ఓ విక్రం సింగ్‌ రాథోడ్‌ తెలిపారు. దీని వల్ల పక్షుల నివాసానికి, పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా వాటి నివాసానికి ఎటువంటి నష్టం జరగకుండా ప్రజలకు, పక్షుల పట్ల ప్రేమ కలిగేలా దీనిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రకృతి సోయగాలతో నిండిన అటవీ పరిసరాల్లో నిర్మించిన ఈ సదుపాయాన్ని సందర్శకులు, విద్యార్థులు, పరిశోధకులు, ప్రకృతి ప్రేమికులు వినియోగిం చుకోవచ్చని వెల్లడించారు. ప్రకృతి ప్రేమికులు పులిగుండాల సౌందర్యాన్ని ఆస్వాదించి, సహజ సంపద సంరక్షణలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -