బడ్జెట్లో గతేడాది కంటే పెరిగిన రూ.2080 కోట్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 2026-27 బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర బడ్జెట్ రూ.3,24,234 కోట్లలో అన్ని శాఖలకన్నా అత్యధికంగా రూ.33,688 కోట్లను ప్రతిపాదించింది. గతేడాది కేటాయించిన రూ.31,605 కోట్లతో పోల్చితే రూ.2080 కోట్లు పెరిగింది. గ్రామీణ రోడ్లను హైబ్రిడ్ అన్యుటీ మోడ్ (హెచ్ఏఎం) నిర్మాణం, అభివృద్ధి, నిర్వహణ విధానంలో చేపట్టాలని ప్రతిపాదించారు. మొదటి దశ కింద 96 నియోజక వర్గాల పరిధిలో 7,450 కిలోమీటర్ల రోడ్లను నిర్మిస్తారు. ఈ విధానం ప్రకారం 40 శాతం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన 60 శాతాన్ని రాయితీదారు పెట్టుబడి పెడతారు.
ఈ 60 శాతాన్ని 15 సంవత్సరాల కాలపరిమితిగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం 30 వాయిదాల్లో చెల్లిస్తుంది. అలాగే ఉపాధి హామీ చట్టం కింద 120 రోజుల పనికి కేంద్రం చెల్లించే 60 శాతం వాటాలో 40 శాతం మ్యాచింగ్ గ్రాంట్‌గా వెచ్చించనుంది. అయితే కేంద్ర ప్రతిపాదన 60శాతంపై తెలంగాణ సర్కార్ బడ్జెట్లో వ్యతిరేకించింది. రాష్ట్రాలను సంప్రదించ కుండా చేశారని ఆరోపించింది. గతంలోనే రాష్ట్ర శాసనసభ కొత్త విధానాన్ని రద్దు చేయాలని తీర్మానించిందని పేర్కొంది. ఇది అమలయితే తెలంగాణలో తిరిగి వలసలు మొదలై తాయని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం నుంచి పంచాయతీ రాజ్ శాఖకు 15 ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను గ్రామాల్లో మౌళిక సదుపాయాలకు వెచ్చిస్తున్నట్టు బడ్జెట్లో సర్కార్ పేర్కొంది.
పంచాయతీరాజ్ శాఖకు పెద్దపీట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



