Saturday, March 21, 2026
E-PAPER
Homeజిల్లాలురంజాన్ వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్

- Advertisement -

 –  ప్రభుత్వ సలహాదారు సభ్యులుకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ 

నవతెలంగాణ –  కామారెడ్డి 

జిల్లా కేంద్రంలో ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన రంజాన్ పర్వదిన వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సీనియర్ నాయకుడు నయీమ్, యువ నాయకుడు ఇలియాజ్‌లకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైందని రంజాన్ పండుగ సందేశం ఇస్తుందని పేర్కొన్నారు. రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ, హిందూ – ముస్లింలు ఐక్యంగా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఆర్డీవో వీణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -