- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి, బిబిపేట్
బీబీపెట్ మండల కేంద్రంలో ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జామ మస్జిద్ నుండి తస్బీ చదువుతూ ముస్లిం సోదరులు ఈద్గా వరకు ర్యాలీగా చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. నమాజ్ అనంతరం అల్లాకు దువా చేస్తూ దేశం సశ్యశ్యామలంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, కార్మికులు సహా కష్టపడే ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. గ్రామంలోని అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు, పిల్లలు, పెద్దలు అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని పరస్పరం ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
- Advertisement -



