నవతెలంగాణ – తొగుట
మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. శనివారం మండలంలోని లింగాపూర్, వెంకటరావుపేట, చందాపూర్, తొగుట, లింగంపేట, కాన్గల్, గుడి కందుల, మెట్టు, పెద్ద మసాన్ పల్లి, ఎల్లారెడ్డి పేట, తుక్కాపూర్ గ్రామంలో ముస్లిం సోదరులు తెల్లవారుజామున నుంచే మసీదుల్లో ప్రత్యే క నమాజులు నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకు న్నారు. నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు పాటించిన నియమాలను గుర్తు చేసుకుంటూ, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించారు. చిన్నారులు కొత్త బట్టలు ధరించి ఆనందంగా వేడుకల్లో పాల్గొని, పెద్దలు, బంధుమిత్రులను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక వంట కాలు తయారు చేసి పరస్పరం పంచుకున్నారు.
ముఖ్యంగా షీర్ ఖుర్మా వంటి వంట కాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పేదల కు దానం చేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా రంజాన్ సందేశాన్ని ప్రతిబింబించారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మండల వ్యాప్తంగా ఆనందోత్సా హాల మధ్య రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో నజీ ముద్దీన్, తాజుద్దీన్, జహంగీర్, షాదుల్, అబ్దుల్ ,ఆజాం, సిరాజ్, అష్రఫ్, షఫీ, సాజి త్, మోహిన్, మునీరుద్దీన్ తదితరులు ఉన్నారు.



