- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
రూరల్ సీఐ జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్సై శైలేందర్ లను పట్టణానికి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వారితో ఆయన పలు విషయాలపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో పోలీసులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు రాంప్రసాద్, నూకల శేఖర్, బాల్కొండ మాజీ ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



