Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొత్త పింఛన్లకు మోక్షం!

కొత్త పింఛన్లకు మోక్షం!

- Advertisement -

మండలంలో నిరీక్షిస్తున్న వారి సంఖ్య వెయ్యి కన్నా ఎక్కువే
బడ్జెట్ ప్రసంగంతో దరఖాస్తుదారుల్లో చిగురిస్తున్న ఆశలు
నవతెలంగాణ – మల్హర్ రావు

కొత్త పింఛన్ల కోసం నిరీక్షిస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి.రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లను అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క ప్రకటించడంతో దరఖాస్తుదారులకు ఊరట లభించనుందనే అభిప్రాయం వ్యక్త మవుతోంది. మండలంలో చేయూత(ఆసరా) పథకం కింద ఇప్పటికే మండలంలో 3,349 మందికి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, బీడీ, చేనేత, గీత కార్మికులకు పింఛన్లు అందుతున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త పింఛన్లను అందిస్తామని ఎన్నోమార్లు సీఎం, మంత్రులు ప్రకటించినా నిధుల కొరతతో ఆచరణలో సఫలం కాలేదు. కొత్త పింఛన్ల కోసం మండలంలో దాదాపు వెయ్యి దరఖాస్తులకు పైగానే పెండింగ్లో ఉన్నాయని అంచనా. 2022లో నిలిచిపోయిన కొత్త పింఛన్ల ప్రక్రియతో ఎంతో మంది అర్హులైన వారు ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రధానంగా దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులకు మొదటి ప్రాధాన్యతగా పింఛన్లను అందించాలనే డిమాండ్ ఉంది. ఏది ఏమైనా నాలుగు సంవత్సరాల తర్వాత కొత్త పింఛన్ల ప్రక్రియ మొదలు కానుండటంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయని చెప్పవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -