- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండల పరిధిలోని గ్రామాలైన బిజ్జల్ వాడి, లొంగన్, నాగల్ గావ్ , గ్రామాల వ్యవసాయ క్షేత్రాలలో అత్యధికంగా పాములు సంచరిస్తున్నాయని స్థానిక రైతులు చెబుతున్నారు. రాత్రిపూట వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే తీవ్ర భయాందోళనలకు గురవుతున్నామని అన్నారు. ఈ క్రమంలో శనివారం పడంపల్లి గ్రామంలో పలువురు రైతులు మొక్కజొన్న పంట పొలాలకు నీరు పెట్టెందుకు వెళ్తున్న క్రమంలో వారికి సుమారు 2 మీటర్లు గల కొండ చిలువ కనిపించిందని తెలిపారు. వెంటనే తోటి రైతుల సాయంతో దానిని హతమార్చామని వారు వెల్లడించారు.
- Advertisement -



