Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎద్దుల పందాలలో విజేతలకు బహుమతులు అందజేసిన బుసిరెడ్డి

ఎద్దుల పందాలలో విజేతలకు బహుమతులు అందజేసిన బుసిరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం, బుడ్డారెడ్డి గూడెంలో ఉగాది పర్వదినం సందర్బంగా మస్థాయిలో ఎద్దుల పందాలు వైభవంగా జరిగాయి. 11 జతల ఎద్దులు పందెంలో పాల్గోన్నాయి. ఈ పోటీలకు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న  మొదటి స్ధానంలో గెలిచిన ఎడ్ల జతకు రూ. 10 వేల మొదటి  బహుమతిని శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో  కోయగూరోనిబావి సర్పంచ్ పృధ్వీ, కొప్పోలు రామాలయం ఛైర్మన్ ఐతగోని పరమేష్ గౌడ్,కొప్పోలు మాజీ సర్పంచ్ తిరుగుడు లింగారెడ్డి, బిజెపి గుర్రంపోడు మండల అధ్యక్షులు మామిడి వినోద్,బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు సింగం నరేష్ యాదవ్,ఫ్రెండ్స్ యూత్ రాంబాబు,అమరేందర్ కోటేష్, శ్రీనాథ్,శ్రీకాంత్,వెంకటేష్,శ్రీనాథ్, కోడుమూరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -