- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు యంకె ముజీబొద్దీన్కు జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి – స్వామి పలువురు కౌన్సిలర్లు ఈద్ ముభారక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు పిట్ల వేణుగోపాల్, గెరిగంటి స్వప్న-లక్ష్మినారాయణ, మీర్జా హఫీజ్ బెగ్, అర్కల ప్రభకర్ యాదవ్, గోపు రాజమణి – నర్సింలు, ఏజాస్, మామిండ్ల లక్ష్మన్, లోలం శ్రీనివాస్, మన్సూర్ తదితరులు పాల్గొని ముజీబొద్దీన్ ని అభినందించారు. రంజాన్ పండుగ సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, సమాజంలో శాంతి, సామరస్యాలు మరింత బలపడాలని వారు ఆకాంక్షించారు.
- Advertisement -



