Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదోడి సొంతింటి కళ సాకారం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం

పేదోడి సొంతింటి కళ సాకారం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం

- Advertisement -

– దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – తొగుట

దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తుక్కా  పూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజిఎస్ నిధుల ద్వారా మంజూరైన రూ. 10 లక్షల సీసీ రోడ్డు నిర్మాణం పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సహకారం తో దుబ్బాక నియో జకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా మన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయ న్నారు. పేదోడి ఇంటి కల సాహారం చేసేం దుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నా రు. అనంతరం చిక్కుడు ఉపలయ్య ఇంది రమ్మ ఇళ్లు నూతన గృహ ప్రవేశ కార్యక్రమం లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిక్కుడు మస్టి కళావతి స్వామి, ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి(అమర్), సర్పంచ్లు పాగాల శోభా కొండల్ రెడ్డి, వార్డ్ సభ్యులు గొడుగు శ్రీశైలం, రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు బరెంక్కల స్వామి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉల్లెంగుల సాయి ముది రాజ్, సీనియర్ నాయకులు చిలివేరి రాంరెడ్డి, నిరంజన్ రెడ్డి, బండారు రమేష్ గౌడ్, భారత్ తేజ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -