Saturday, March 21, 2026
E-PAPER
Homeకరీంనగర్భూపతిపూర్ పద్మశాలి సేవాసంఘానికి విరాళం

భూపతిపూర్ పద్మశాలి సేవాసంఘానికి విరాళం

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
మండలంలోని భూపతిపూర్ గ్రామ పద్మశాలి సేవాసంఘ అభివృద్ధికి జగిత్యాల శ్రీ మిత్ర హాస్పిటల్ వైద్యుడు వాసాల శ్రీధర్ తమ వంతు సహకారంగా రూ.1 లక్ష విరాళాన్ని ప్రకటించారు. ఈ విరాళాన్ని తన తండ్రి లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థంగా అందజేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ శ్రీధర్ సేవా భావాన్ని ప్రశంసిస్తూ పద్మశాలి సేవాసంఘ సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు కటుకం సతీశ్,మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్,సంఘ పెద్దలు మామిడాల నర్సయ్య,బోగ సత్తయ్య,వాసాల రాములు,బోగ లక్ష్మీనారాయణ,జక్కుల రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -