నవతెలంగాణ- నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్త పెళ్లి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం పరిశీలిస్తున్నట్లు ఎస్సై చిర్ర రమేష్ బాబు, ఆ గ్రామ సర్పంచ్ యాకాంతం గౌడ్ తెలిపారు. శనివారం గ్రామంలోని మెయిన్ వీధులలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ చోట కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఉంటే అనుకోకుండా ఏమైనా జరిగినట్లయితే వాటిని ఏర్పాటు చేయడానికి ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అంతేకాకుండా దొంగతనాలు మరియు ఆక్రమ వ్యాపారాలు అలా చేసి వెళితే మెయిన్ రోడ్డుపై ఫిట్ చేసిన సీసీ కెమెరాలలో బంధించబడి ఉంటుందని, దాన్ని చూసినట్లయితే ఎవరు ఈ రహదారిపై వెళ్లిన పట్టుబడతారని అన్నారు. ఒక సీసీ కెమెరా ఒక పదిమందితో సమానం అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బొల్లు మురళి మరియు బొల్లు రాజేష్ జెల్ల ఉపేందర్ జెల్ల అనిల్ జెల్ల రవీందర్ ఆసొద ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై, సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



