Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు 

భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
మండల కేంద్రంతోపాటు, వాడియాల, బోయిన్పల్లి, రాణి పేట, కంచనపల్లి ,దోనూర్, వల్లభరావు పల్లి, కొత్తపల్లి తదితర గ్రామాలలో శనివారం రంజాన్ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రంజాన్ మాసం ప్రారంభం నుంచి ఉపవాస ప్రార్థనలతో మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సోదర భావంతో రంజాన్ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ముస్లిం మత పెద్దలు చెప్పారు.

వివిధ రాజకీ పార్టీ నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు. మిడ్జిల్ వాడియాల దర్గాల దగ్గర సర్పంచులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, చంద్రయ్య గౌడ్, పాల్గొని ముస్లిం సోదరులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు . కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీపీ సుదర్శన్, ఆయా గ్రామ సర్పంచులు, నాగరాజు గౌడు, శ్రీనివాస్ గౌడ్, మిడ్జిల్ మాజీ ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ గౌస్, ఉస్మాన్, రషీద్, సమ్మద్, జహీర్, రజాక్, ఖలీల్ , ఆయా గ్రామాల ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -