నవతెలంగాణ – మిడ్జిల్
కారు బైకు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాణి పేట గ్రామానికి చెందిన మల్లేష్ జడ్చర్ల నుండి ఇంటికి వస్తుండగా కొత్తపల్లి గ్రామ శివారులోని 167 జాతీయ రహదారిపై కల్వకుర్తి నుండి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు తెలిపారు. మృతుడు మల్లేష్ కు, భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
కారు బైకు ఢీ.. వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


