Saturday, March 21, 2026
E-PAPER
Homeజాతీయంఇరాన్ అధ్య‌క్షుడికి పీఎం మోడీ ఫోన్

ఇరాన్ అధ్య‌క్షుడికి పీఎం మోడీ ఫోన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల వేళ‌..పీఎం మోడీ ఇరాన్ అధ్య‌క్షుడు పెజెష్కియాన్‌కు ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రంజాన్‌ (Ramadan), పర్షియన్‌ నూతన సంవత్స నౌరుజ్‌ (Nauruz) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పర్వదినాలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు, ప్రపంచ సరఫరా గొలుసుకు ఆటంకం కలిగించే కీలక మౌలిక సదుపాయాలపై దాడులను ప్రధాని ఖండించారు.

యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్‌ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడటం ఇది రెండోసారి అని చెప్పారు. మార్చి 12న ఓసారి ఫోన్‌లో సంభాషించిన ప్రధాని.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంపై ఆందోళన వ్యక్తంచేశారు. చర్చలు, దౌత్యమార్గాల్లోనే సంక్షోభాలను పరిష్కరించుకోవాలని ఇరాన్‌ అధ్యక్షుడికి సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -