Sunday, March 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధ్యానంతోనే జ్ఞానం

ధ్యానంతోనే జ్ఞానం

- Advertisement -

లలిత సహస్రనామ పారాయణం భక్తి వాతావరణం
నవతెలంగాణ – కాటారం 

కాటారం మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో ధ్యాన జ్ఞాన శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. బ్రహ్మర్షి పితామహా పత్రీజీ ఆశీస్సులతో జ్ఞానదాత బ్రహ్మవిద్వరిష్ట శ్రీమతి జక్కా పద్మ మేడం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ధ్యానం, ఆధ్యాత్మికతపై విశేష అవగాహన కల్పించారు.

పిరమిడ్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు అనంతుల రమేష్ బాబు అధ్యక్షత వహించగా, పిరమిడ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు గడ్డం రామకృష్ణ సమన్వయం చేశారు. కార్యక్రమంలో భాగంగా లలిత సహస్రనామ పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా జక్కా పద్మ మేడం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ధ్యానం చేయడం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. ధ్యానం ద్వారానే జ్ఞానం లభిస్తుందని, ఆ జ్ఞానం మనిషిని ముక్తి వైపు నడిపిస్తుందని వివరించారు. శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని చెప్పారు.

లలిత సహస్రనామ పారాయణం యొక్క ప్రాముఖ్యతను వివరించిన ఆమె, పరాశక్తి అనేది మనలోనే ఉందని, ఆత్మజ్ఞానం ద్వారా దానిని గ్రహించవచ్చని తెలిపారు. మాధవుడిని బయట వెతకకుండా మన అంతరంగంలోనే అన్వేషించాలని ఆత్మబోధ చేశారు.

మహానుభావుల ఉపన్యాసాలు వినడం, ఆత్మజ్ఞాన గ్రంథాలు చదవడం, సజ్జన సాంగత్యం కలిగి ఉండడం ద్వారా ఆధ్యాత్మిక వికాసం సాధ్యమవుతుందని సూచించారు. సామూహిక ధ్యానంలో పాల్గొనడం ద్వారా అపారమైన శక్తిని పొందవచ్చని పేర్కొన్నారు.

అనంతరం ఆర్యవైశ్య సంఘం మరియు దాతల సహకారంతో ధ్యాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సరోజమ్మ, మంథని పట్టణ పిరమిడ్ సొసైటీ నిర్వాహకులు సునీత, విజయ్ కుమార్, పిరమిడ్ మాస్టర్లు, వివిధ మండలాల నుంచి వచ్చిన ధ్యానులు, మహిళలు సుమారు 300 మంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -