మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. కావ్య, శ్రావ్య నిర్మాతలు. ఈనెల 26న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు చిరంజీవి విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే లవ్‌స్టోరీగా దీన్ని రూపొందించారు.
హీరో, హీరోయిన్ మధ్య ఉండే ప్రేమ, గిల్లికజ్జాలను హత్తుకునేలా రూపొందించారు. హీరో హర్ష్ రోషన్ తన మరదలైన హీరోయిన్ ప్రేమను గెలవటానికి ఏం చేశాడు? తనకు ఎదురైన ఇబ్బందులేంటి? వాటిని ఎలా అధిగమించాడు? అనే అంశాలతో బ్యాండ్ మేళం సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. తాజాగా ట్రైలర్‌తో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. శివరాజు ప్రణవ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు.
వినోదం, భావోద్వేగాల ‘బ్యాండ్ మేళం’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



