ఈద్, నౌరూజ్ శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ శనివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌కు ఈద్, నౌరూజ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగకాలం పశ్చిమాసియాకు శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును తీసుకు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇరాన్ నాయకుడితో జరిపిన ఫోన్ సంభాషణలో మోడీ ఇరాన్‌లో కీలక మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను ఖండించారు. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తాయని అన్నారు. ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగిస్తాయని నొక్కి చెప్పారు. నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించాలనీ, షిప్పింగ్ మార్గాలు తెరిచి సురక్షితంగా ఉండేలా చూడాలని దాని ప్రాముఖ్యతను మోడీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ మేరకు మోడీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన మోడీ
- Advertisement -
- Advertisement -



