Sunday, March 22, 2026
E-PAPER
Homeక్రైమ్బాల్కనీ స్లాబ్ కూలి ఇద్దరు మృతి

బాల్కనీ స్లాబ్ కూలి ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బాల్కనీ స్లాబ్ కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుందన్ బాగ్ మెథడిస్ట్ కాలనీలోని శ్రీవాత్స అపార్ట్‌మెంట్‌ యజమాని ద్వారకాప్రసాద్ తన అపార్ట్ మెంట్ లో పనుల నిమిత్తం దేవీదాస్ (56), వివేక్ (32)లను ఇంటికి పిలిచాడు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటూ మూడో ఫ్లోర్ కు చేరుకోగానే ఒక్కసారిగా బాల్కనీ స్లాబ్ కూలిపోయింది. దీంతో ముగ్గురూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో దేవీదాస్, వివేక్‌ అక్కడికక్కడే మృతిచెందారు.

అపార్ట్ మెంట్ యజమాని ప్రసాద్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఆయన్ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -