Sunday, March 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం: సర్పంచ్

గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
మండల పరిధిలోని కరివిరాల గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.20 లక్షలతో చేప‌ట్టిన‌ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ మోర సంధ్య బిక్షం ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్నదే తమ సంకల్పం అన్నారు. ప్రజా ప్రభుత్వంలో గ్రామాలకు అధిక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధిప‌థంలో నిలుపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -