నవతెలంగాణ – దర్పల్లి
కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలోనే తండాలు అభివృద్ధి చెందడం జరుగుతుందని గుడితండా గ్రామ సర్పంచ్ మాలవత్ సరస్వతి రమేష్ అన్నారు. ఆదివారం మండలంలోని సీతాయిపేట గుడితండా, హాట్య నాయక్ తండా, పూర్య నాయక్ తండాల్లో రూ.15 లక్షల ఎన్ ఆర్ ఈజీ ఎస్ నిధులతో సిసి రోడ్డు పనులను మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ తో కలిసి ప్రారంభించారు.
ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ తమ తండాలోని రహదారుల అభివృద్ధికి నిధులు కావాలని రూరల్ ఎమ్మెల్యే డా, భూపతి రెడ్డి గారికి విన్నవించగా స్పందించి తమ పంచాయతీకి రోడ్లకొరకు 15 నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే గారికి పంచాయతీ తరపున ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ మంగిత్యా నాయక్, ఉపసర్పంచ్ మోహన్ నాయక్ధ,మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు చెలిమేల శ్రీనివాస్, మాలవత్ రమేష్ నాయక్, శ్రీనివాస్ నాయక్, మాజీ సర్పంచ్ లింబ్య నాయక్, బలి రామ్ నాయక్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, తండా నాయక్ కార్ బార్లు పెద్దమనుషులు తదితరులు పాల్గొన్నారు.


