నవతెలంగాణ-బీర్కూర్ (నసురుల్లాబాద్)
బీర్కూర్ మండల కేంద్రాల్లో షాహిద్ దివాస్ సందర్భంగా మేర యువభారత్ ఆధ్వర్యంలో శ్రమదానం, భగత్ సింగ్ విగ్రహం కు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ సునీల్ రాథోడ్, గ్రామ సర్పంచ్ ధర్మతేజ లు మాట్లాడుతూ భారతదేశం స్వేచ్ఛ, కీర్తి, సంక్షేమం పురోగతి కోసం పోరాడిన సమరయోధులను స్మరించుకోవానికి ప్రతి సంవత్సరం షహీద్ దివస్‌ను జరుపుకోవడం జరుగుతుందన్నారు.
భారత దేశ స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది త్యాగధనులు తమ విలువైన ప్రాణాలను త్యాగం చేశారు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి సౌర్యాన్ని నిబద్ధతను గౌరవిస్తూ జ్ఞాపకార్ధంగా నిర్వహించేదే ఈ షాహిద్ దివాస్ స్వాతంత్ర పోరాటంలో అమరులైన కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల పోరాటాలను గుర్తుకు చేసుకొని శ్రమదానం చేశారు కామ్రేడ్ భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నీళ్లతో శుభ్రం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది .ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు యన్. బాలరాజ్, వార్డు మెంబర్ నవీన్, గ్రామ యువకులు వెంకట్, బాలకృష్ణ, రమేష్, కోర్రి కృష్ణ,సురేష్, గంగాధర్, పోశెట్టి, నాయకులు సాయికుమార్, శేఖర్, విహాన్ లు తదితరులు పాల్గొన్నారు.



