నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కొత్తచెరువు తండా గ్రామపంచాయతీ శివారులో నూతనంగా నిర్వహించిన సేవాలాల్ ఆలయ ఆవరణలో ఆదివారం చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లకావత్ సంతోష్ ఆధ్వర్యంలో తండా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం ఆవరణలో పదుల సంఖ్యలో కొబ్బరి చెట్లతో పాటు పలు రకాల చెట్లను నాటినట్లు ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష్ తెలిపారు. నాటిన చెట్ల సంరక్షణ కోసం అవసరమైన చర్యలు కూడా చేపడుతున్నట్లు ఆయన వివరించారు. తండా ప్రజలకు నాటిన చెట్ల సంరక్షణ బాధ్యతను ఒక్కొక్కరికి ఒక్కో చెట్టు చొప్పున అప్పగిస్తున్నట్లు ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష్ పేర్కొన్నారు. చెట్లు నాటే కార్యక్రమం లో పెద్ద ఎత్తున తరలివచ్చి, చెట్లు నాటేందుకు తోడ్పాటు అందించిన తండా ప్రజలకు సర్పంచ్ సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు.
సేవాలాల్ ఆలయ ఆవరణలో చెట్లు నాటే కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


