నవతెలంగాణ – బోనకల్
విప్లవ వీరుడు భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని సిపిఎం మండల కార్యదర్శి కిలారి సురేష్ అన్నారు. ఖమ్మం జిల్లా మధ్యల నియోజకవర్గంలోని బోనకల్ మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో విప్లవ వీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతిని ఆదివారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ భగత్ సింగ్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగాడలాడించిన విప్లవ వీరుడు అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్ పోరాట స్ఫూర్తి దేశ యువతకు ప్రధాన స్ఫూర్తి అన్నారు. దేశ స్వాతంత్రం కోసమే తన ప్రాణాలను అతిపెన్నవయసులో అర్పించారన్నారు.
అటువంటి విప్లవ వీరుడిని ఆదర్శంగా తీసుకొని యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్ పోరాట చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం నేటి సమాజంలో నెలకొని ఉందన్నారు. కానీ యువతీ యువకులు అటువంటి ప్రయత్నాలు ఏమి చేయకుండా చెడు మార్గాలలో పయనిస్తూ వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భగత్ సింగ్ ని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మధిర డివిజన్ కమిటీ సభ్యులు బంధం శ్రీనివాసరావు, తెల్లాకుల శ్రీనివాసరావు, స్టడీ సర్కిల్ మాజీ కన్వీనర్ బోయినపల్లి కొండ, మండల కమిటీ సభ్యులు పిల్లలమర్రి వెంకట అప్పారావు, కూచిపూడి మురళి, గుగులోతు నరేష్, పార్టీ నాయకులు బూర్గుల అప్పాచారి, చేపూరి వెంకటేశ్వర్లు, ఉప్పర శ్రీను, సూర్య ప్రకాష్ రావు, సుందర్ రావు, జయరాజు, మహిళా సంఘం నాయకురాలు పిల్లలమర్రి ఝాన్సీ రాణి, మచ్చ గురవయ్య, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.



