Monday, March 23, 2026
E-PAPER
Homeసినిమాభావోద్వేగాలు, విజువల్‌ ట్రీట్‌తో 'అరెరే..' పాట

భావోద్వేగాలు, విజువల్‌ ట్రీట్‌తో ‘అరెరే..’ పాట

- Advertisement -

హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో సింగర్‌, నటి దియా అందించిన ‘అరెరే.. అరెరే..’ మ్యూజిక్‌ వీడియో ఆల్బమ్‌ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. బటర్‌ఫ్లై మ్యూజిక్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ మ్యూజిక్‌ వీడియో విడుదల వేడుకకు తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.ఎన్‌. ఆదిత్య, హీరో పూరి ఆకాష్‌, సమీర్‌, సాగర్‌, సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు శివారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి, ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.ఎన్‌. ఆదిత్య మాట్లాడుతూ,’దియా ఒక వండర్‌ఫుల్‌ టాలెంట్‌. ఈ మ్యూజిక్‌ ఆల్బమ్‌ చాలా హృద్యంగా ఉంది. ఆమె గాత్రం, నటన రెండింట్లోనూ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి కొత్త ప్రతిభలు ముందుకు రావడం తెలుగు సంగీత రంగానికి మంచి సంకేతం’ అని అన్నారు.

‘ఈ పాటలో దియా చూపించిన భావ వ్యక్తీకరణ, గాత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటాయి’ అని రఘు కుంచె చెప్పారు. నటి, సింగర్‌ దియా మాట్లాడుతూ,’ఈ ఆల్బమ్‌ రూపుదిద్దుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా మీద నమ్మకం ఉంచి ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన టీమ్‌ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమానికి విచ్చేసి ఆశీర్వదించిన గౌరవనీయ అతిథులందరికీ నేను రుణపడి ఉంటాను. ప్రేక్షకుల ప్రేమ, ఆదరణే నాకు పెద్ద బలం. ఈ ఆల్బమ్‌ అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.

నిర్మాత నూతన్‌ చెకురి మాట్లాడుతూ, ‘ఎప్పటి నుంచో ఒక మంచి మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేయాలన్న దియా కోరిక ‘అరెరే.. అరెరే..’ ద్వారా నెరవేరింది. ఆమె ప్రతిభపై నాకు ఉన్న నమ్మకం ఈ ప్రాజెక్ట్‌ ద్వారా మరింత బలపడింది. మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ ఆల్బమ్‌ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని విశ్వసిస్తున్నాను’ అని అన్నారు. ‘భావోద్వేగాలతో కూడిన అందమైన విజువల్‌ అనుభూతిని ప్రేక్షకులకు అందించాలన్న లక్ష్యంతో రూపొందించాం’ అని దర్శకుడు క్రాంతి వర్మ చెప్పారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ శరవణ వాసుదేవన్‌ మాట్లాడుతూ,’ఈ సాంగ్‌ను దియా చాలా చక్కగా పాడారు. టీమ్‌లోని ప్రతి ఒక్కరి కృషితో పాట ఇంత బాగా వచ్చింది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -