Monday, March 23, 2026
E-PAPER
Homeసినిమావిలేజ్‌ పొలిటికల్‌ డ్రామాతో 'తెరచాప'

విలేజ్‌ పొలిటికల్‌ డ్రామాతో ‘తెరచాప’

- Advertisement -

అనన్య క్రియేషన్స్‌ బ్యానర్‌ పై కైలాష్‌ దుర్గం నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం ‘తెరచాప’. జోయల్‌ జార్జ్‌ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నవీన్‌ రాజ్‌ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రల్లో నటించగా, రాజీవ్‌ కనకాల, పృథ్వీరాజ్‌, జగదీష్‌ ప్రతాప్‌ బండారి, ఫిష్‌ వెంకట్‌, జబర్దస్త్‌ అశోక్‌, నాగి, అప్పారావు, రైసింగ్‌ రాజు, రాజేష్‌ భూపతి, నాగ వంశీ, శ్రీనివాస్‌ నేస, చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజీమ్‌, వెంకట్‌ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల్‌ క్రిష్‌, ఎం.ఎల్‌ రాజా సంగీతాన్ని అందించారు. రాజు బొడసింగి ఎడిటింగ్‌ చేయగా జీవన్‌ జార్జ్‌ కోరియోగ్రఫీ చేశారు. విడుదల తేది దగ్గరవుతున్న సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఆహ్లాదకరమైన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో మొదలై సముద్రతీరంలో ఉండే ఒక ఊరి కథలా అనిపిస్తుంది. ఊరంటే మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలుతో పాటు రాజకీయాలు, భేద భావాలు ఉండడం కూడా సహజమే. అటువంటి పరిస్థితుల మధ్య ఒక యువకుడు తన ఊరిలో ఉన్న పరిస్థితుల పట్ల పోరాడుతున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. డైలాగ్స్‌, టేకింగ్‌ చాలా బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బెంచ్‌ మార్క్‌ సృష్టించే విలేజ్‌ పొలిటికల్‌ డ్రామాలా అనిపిస్తుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: ప్రజాల్‌ క్రిష్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: ఎంఎల్‌ రాజా, డైలాగ్స్‌: జోయెల్‌ జార్జ్‌, మిద్దె మనోజ్‌ కుమార్‌, సాహిత్యం: మిద్దె మనోజ్‌ కుమార్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -