ఆటగాళ్లకు శ్రీలంక బోర్డు ఆదేశం
కొలంబో (శ్రీలంక) : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు సిద్ధమవుతున్న శ్రీలంక క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ నిబంధన విధించింది. నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేసేందుకు ఫిట్‌నెస్ పరీక్ష పాస్ కావాలని మార్గదర్శకాలు జారీ చేసింది. దుష్మంత చమీర, పథుమ్ నిశాంక (ఢిల్లీ క్యాపిటల్స్), కామిందు మెండిస్ (సన్‌రైజర్స్) ఫిట్‌నెస్ పరీక్ష పాస్ అయ్యారు. దీంతో ఐపీఎల్‌లో ఆడేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వానిందు హసరంగ (లక్నో సూపర్‌జెయింట్స్), నువాన్ కులశేఖర (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), మతీశ పతిరణ (కోల్‌కతా నైట్‌రైడర్స్), ఈషన్ మలింగ (సన్‌రైజర్స్ హైదరాబాద్) ఫిట్‌నెస్ ఫరీక్షకు హాజరు కావాల్సి ఉంది. మే ఆఖరు వారం వరకు శ్రీలంక అంతర్జాతీయ షెడ్యూల్ ఖాళీగా ఉంది. దీంతో ఈ సమయంలో ఫిట్‌నెస్ ప్రమాణాలను మెరుగుపర్చు కోవాలని ఆటగాళ్లకు బోర్డు సూచనలు జారీ చేసింది.



