Monday, March 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురైతుబంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చే

రైతుబంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చే

- Advertisement -

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రైతుబంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్‌ ద్వారా స్పందించారు. పండించిన పంటను కాంగ్రెస్‌ సర్కారు కొనకపోవడంతో నానాకష్టాలు పడుతున్న రైతన్నల గోడు తెలుసుకునేందుకు నవంబర్‌ 18న తాను స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డ్‌కు వెళ్లానని గుర్తు చేశారు.

అంతకు ముందురోజే ఆదిలాబాద్‌ జిల్లా ఆర్లీ(బీ)కి గ్రామానికి చెందిన తుడుం గణపతి మీడియాతో కష్టాలు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారని గుర్తు చేశారు. నాలుగు రోజులుగా మార్కెట్‌ యార్డులో ఉంటున్నా ఆయన సోయాబీన్‌ పంటను కొనడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. కాంగ్రెస్‌ సర్కారు ఇట్లాగే పంటను కొనకుండా వేధిస్తే, ఆయనకు మరణం తప్ప మరోమార్గం లేదని రోదించారని వివరించారు.రుణమాఫీ కాక, రైతుభరోసా రాక, అప్పుల బాధ తీవ్రమై మూడు రోజుల క్రితం గణపతి ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదనీ, ముమ్మాటికీ రేవంత్‌ సర్కారు చేసిన హత్యనే అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -