Monday, March 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవడదెబ్బతో ఉపాధి హామీ కూలి మృతి

వడదెబ్బతో ఉపాధి హామీ కూలి మృతి

- Advertisement -

నవతెలంగాణ- వెల్దుర్తి
మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం ఆరెగూడెం గ్రామంలో ఆదివారం వడదెబ్బతో ఉపాధి హామీ కూలి మృతిచెందాడు. కుంటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆరెగూడెం గ్రామానికి చెందిన ఏర్పుల నాగలక్ష్మి(45) రోజు వారీలాగే శనివారం ఉపాధి హామీ కూలి పనికి వెళ్లింది. తిరిగి మధ్యాహ్నం ఇంటికొచ్చాక మంచినీరు తాగిన కొద్దిసేపట్లోనే కండ్లు తిరుగుతున్నాయంటూ పడిపోయింది. దీంతో ఆమె భర్త రాజయ్య వెల్దుర్తి ఏరియా ఆస్పత్రికి తీసుక పోయాడు. పరీక్షించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకుపోవాలని సూచించారు. వెంటనే గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. రోజు కూలి చేస్తేకానీ పూటగడవని కుటుంబమని, ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్‌ పాలవంచ శేఖర్‌, గ్రామస్తులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -