Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పార్టీలతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇండ్లివ్వాలి..

పార్టీలతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇండ్లివ్వాలి..

- Advertisement -

నల్లమలలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
సీపీఐ 18వ మహాసభలో జిల్లా కార్యదర్శి బాల్ నరసింహ
నవతెలంగాణ – అచ్చంపేట :
రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, నల్లమల్ల ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు ముడి సరుకు అందుబాటులో ఉంది ప్రభుత్వాలు స్పందించి ఉపాధినిచ్చే పరిశ్రమలు నిర్మాణం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బాలు నరసింహ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని టీఎన్జీవో భవనంలో సిపిఐ 18వ మహాసభలను నిర్వహించారు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగులకు యువతకు ఉపాధిని కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజు వికాసం పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది వాస్తవానికి స్వయం ఉపాధి లేని నిరుద్యోగులకు రాజీవ్ వికాసం  పథకంలో ఆర్థిక సహాయం చేయాలని అన్నారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులందరికీ రైతు భరోసా పథకం కింద రుణమాఫీ అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉమామహేశ్వరం రిజర్వాయర్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు 25 లక్షలు నుండి 30 లక్షలు  నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బల్మూరు మండలంలోని జిన్ కుంట స్టేజి వద్ద ఏర్పాటుచేసిన లెదర్ పార్క్ ను గత 10  ఏళ్లుగా మూత పడింది వినియోగంలోకి తీసుకొచ్చి చర్మకారులకు ఉపాధి కల్పించాలని ఈ విషయం పైన ముఖ్యమంత్రి ప్రత్యేక తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసి విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు నేతలతో చర్చలు జరిపి ఆపరేషన్ కంగారు నిలుపుదల చేయాలన్నారు.భారత కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీ ప్రజా సమస్యల పైన అలుపెరుగని పోరాటాలు చేయడం జరుగుతుందని జిల్లాలో నల్లమల ప్రాంతంలో సిపిఐ పార్టీ విస్తరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కేశవ్ గౌడ్ డివిజన్ నాయకులు గోపాల్,  నాయకులు డాక్టర్ శ్రీను, మల్లేష్,  పార్వతమ్మ, పాండు, విష్ణు,బషీర్, రాములు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad