Monday, March 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర బడ్జెట్ లో కల్లుగీత కార్మికుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయించాలి

రాష్ట్ర బడ్జెట్ లో కల్లుగీత కార్మికుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయించాలి

- Advertisement -

– కల్లుగీత కార్మికుల ప్రదర్శన

నవతెలంగాణ – కామారెడ్డి

కల్లుగీత కార్మికులకు గత బడ్జెట్ లో కేటాయించిన రూ.93 కోట్లలో ఈ సంవత్సర కాలంలో రూ.17 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగతా రూ.76 కోట్లు ఈ నెల చివరి వరకు ఇవ్వాలనీ, 2026 – 27 బడ్జెట్ లో గీత కార్మికుల సంక్షేమానికి రూ.5 వేల కోట్లు కేటాయించాలని గత సంవత్సరం కేటాయించిన ఖర్చు చేయకుండా ఉన్న మిగతా డబ్బులు మార్చి చివరి వరకు విడుదల చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పై విషయమై ఫిబ్రవరి 17న రాష్ట్ర కార్యవర్గం హైదరాబాదు లోని ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేశాం. మార్చి 17న మరొక్కసారి సోదర వృత్తి సంఘాలను కలుపుకొని ధర్నా నిర్వహించాము. అయినా ప్రభుత్వం ఎప్పటి లాగానే వ్యవహరిస్తుంది. ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న కల్లుగీత వృత్తి పై కనికరమే లేదు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఈ బడ్జెట్ సమావేశాల్లో గీత కార్మికులకు తగిన కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కామారెడ్డిలో నిరసన ప్రదర్శన నిర్వహించినట్టు తెలిపారు.

వేలాది మంది గీత కార్మికులకు 50 ఏండ్లు నిండిన పింఛన్ రావడం లేదు, అలాగే ప్రమాదంలో మరణించిన, వికలాంగులైన గీత కార్మికులకు సంవత్సరాలు గడుస్తున్న ఎక్సిగేషియో ఇవ్వడం లేదు అన్నారు. ‘కల్లుగీత వృత్తి ప్రమాదంలో మరణించిన వారికి ఎక్స్ గ్రేషియా రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచుతాం`, ‘గీత కార్మికులకు వృత్తి పింఛన్ 2000 నుండి 4000 రూపాయలు ఇస్తామన్న`, 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలి ప్రభుత్వ భూమి లేనిచో కొనీ ఇవ్వాలి, జిల్లాలో తాటి ఈత నీరా ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటు చేసి యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కల్లుగీత కార్మికులకు ద్విచక్రవాహనాలు ఇవ్వాలని. కల్లుగీత వృత్తి చేసే ప్రతి ఒక్క గీత కార్మికునికి కాటమయ్య రక్షణ కిట్లను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్, కార్యదర్శి రాజా గౌడ్, ఉపాధ్యక్షులు రవీందర్ గౌడ్ , స్వామి గౌడ్, సాయ గౌడ్, మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -