- Advertisement -
కొండముచ్చు వేషధారణలో కోతులను తరిమిన సర్పంచి
చింతపల్లి సర్పంచ్ వినూత్న ఆలోచన
నవతెలంగాణ – పెద్దవూర
కోతులను భయపెట్టి తరిమేందుకు సర్పంచ్ కొండముచ్చు వేష ధారణ దరించేలా చేశారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి పంచాయతీ కాంగ్రెసు సర్పంచ్ రవినాయక్ విన్నూత ఆలోచన చేశాడు. కోతుల బెడదతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొండముచ్చు వేషం వేయించి కర్ర పట్టుకొని గ్రామంలో తిరుగుతు కోతులను భయపెడుతూ తరిమికొట్టెలా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంటికి ఒకరు చొప్పున మద్దతు తెలుపుతూ కోతుల తరిమి కొట్టారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లయ్య యాదవ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



