Monday, March 23, 2026
E-PAPER
Homeజిల్లాలుజన్నారం మండలం అభివృద్ధి సంఘం

జన్నారం మండలం అభివృద్ధి సంఘం

- Advertisement -

నవ తెలంగాణ జన్నారం..

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా కొనసాగుతున్న మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డా.  షమీం అఖ్తర్ కి జన్నారం మండలం అభివృద్ధి సంఘం తరఫున వినతి పత్రాలు అందజేయడం జరిగినది. జాతీయ రహదారుల అనుసంధానం గురించి ఈ మండల ప్రాంతం గుండా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గల జాతీయ రహదారి నెంబర్ 63 మరియు నిజామాబాద్ నుండి చత్తీస్గడ్ రాష్ట్రంలోని జగదల్పూర్ వరకు వెళుతున్న జాతీయ రహదారి నెంబర్ 61 మరియు గుడిహత్నూర్ నుండి ఇంద్రవెల్లి మీదుగా రహదారి నెంబర్ 44 ఎక్స్టెన్షన్ చేసి ఖానాపూర్ నియోజకవర్గ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాలని చైర్మన్ ని జన్నారం మండల అభివృద్ధి సంఘం తరఫున కోరడం జరిగినది.

మండల, పరిసర గ్రామాల్లో కోతుల వలన రైతులు గృహస్తులు కుటుంబాల వారు పిల్లలు పెద్దలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీరి పై కోతలు దాడి చేస్తున్నాయని ఇండ్లలో చొరబడి అరకిలో కిలో ప్యాకెట్లు ఎత్తుకొని పోతున్నాయని అడ్డగిస్తే దాడి చేసి గాయపరుస్తున్నాయని ‌ కోతుల వలన ఇబ్బందుల నుండి జన్నారం మండలం అన్ని వర్గాల ప్రజలను రక్షించాలని మరొక వినతిపత్రాన్ని అందజేయడం జరిగినది. అలాగే అటవీ శాఖ చెక్ పోస్టుల ద్వారా నిర్బంధంగా టాక్స్లు వసూలు చేసి నాలుగు చక్రాల వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇది నిరోదించాలని మరొక వినతి పత్రాన్ని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కి ఈ మూడు ముఖ్యమైన సమస్యల గురించి వినతి పత్రాలు అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో జన్నారం మండల అభివృద్ధి కమిటీ కన్వీనర్ శ్రీరాముల కొండయ్య, కో కన్వీనర్లు కోడూరి చంద్రయ్య, కడార్ల నర్సయ్, అయిల వేణి రవి, రాథోడ్ రమేష్ లక్ష్మీపూర్ తండా పాల్గొన్నారు.

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ ను జన్నారం హెల్త్ సెంటర్ నందు కలిసిన టిపిసిసి స్టేట్ జాయింట్ కన్వీనర్ కత్తెరపాక రాజేష్ మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వ ఆసుపత్రిని ముప్పై పడకల ఆసుపత్రిలో అప్డేట్ చేయాలని మంచినీటి వీల్ చైర్స్ సౌకర్యం కల్పించాలని వారిని కోరారు. సానుకూలంగా స్పందించిన కమిషన్ చైర్పర్సన్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -