Monday, March 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తాం: UYFI రాష్ట్ర అధ్యక్షులు

భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తాం: UYFI రాష్ట్ర అధ్యక్షులు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం : విప్లవ వీరుడు భగత్ సింగ్ ఆశయాలు నేటికీ సజీవంగా ఉన్నాయని, వాటిని కొనసాగించడం యువత బాధ్యత అని UYFI రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్ పేర్కొన్నారు. సోమవారం కాటారం మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భగత్ సింగ్ చూపిన మార్గం యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.

సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య హక్కుల సాధన కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అణచివేతకు వ్యతిరేకంగా, అన్యాయానికి ఎదురు నిలుస్తూ, దేశంలో చైతన్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. యువతలో చైతన్యం పెంచుతూ, భగత్ సింగ్ ఆశయాలను కార్యరూపంలోకి తీసుకువచ్చే దిశగా UYFI కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా నాయకురాలు సాలినేని రాజమణి, నాయకులు పంచిక మల్లేష్ యాదవ్, బోయిని రాజయ్య, శ్రీనివాస్ రెడ్డి, సుగుణ, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -