Monday, March 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ 

పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణ బార్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా న్యాయవాదుల తుది ఓటర్ లిస్ట్ ను ప్రకటించినట్టు ఎన్నికల అధికారులు బోట్ల జీవన్, అశోక్, సిగ్మతుల్లా ఖాన్ లు సోమవారం తెలిపారు .అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న ప్రవీణ్ చందర్, విజయలక్ష్మి, కొండి పవన్ కుమార్ లలో  ఎవరు కూడా నామినేషన్ ఉపసంహరణ చేసుకోలేదని, ఒక అధ్యక్ష పదవికి మాత్రమే పోటీ అనివార్యమైందని తెలిపారు. ఉపాధ్యక్షునిగా సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా శంకర్, కోశాధికారిగా రాజేందర్, సంయుక్త కార్యదర్శిగా ఎంకె నాగరాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -