- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్ : భిక్కనూర్ పట్టణ కేంద్రంలో గ్రామానికి చెందిన స్రవంతి ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాల్యాల రేఖ సుదర్శన్ ముఖ్య అతిథిగా హాజరై ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేశారు. ఇందిరమ్మ పథకం ద్వారా లబ్ధిదారులకు ఇళ్లు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, నాయకులు మైపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



