Monday, March 23, 2026
E-PAPER
Homeఖమ్మంభగత్ సింగ్ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట

భగత్ సింగ్ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట

- Advertisement -

నవతెలంగాణ – బోనకల్ : అమరవీరుడు విప్లవ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం), సీఐటీయూ నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు మండల కార్యదర్శి కిలారు సురేష్, సీఐటీయూ మండల కన్వీనర్ గుగులోత్ నరేష్ అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండల కేంద్రంలో గల వైరా, మధిర ఆటో అడ్డాలో సీఐటీయూ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కిలారు సురేష్, బోనకల్ ఉపసర్పంచ్ బానోత్ కొండ పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా దేహాన్ని ముక్కలు చేసిన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమని అమరజీవి విప్లవ వీరుడు భగత్ సింగ్ నినదించాడన్నారు. ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ విప్లవ సిద్ధాంతాలు, సామాజిక న్యాయం గురించి ప్రతి ఒక్కరూ లోతుగా అధ్యయనం చేయాలన్నారు. మార్క్స్, లెనిన్ రచనలను చదివి సమానత్వ, సమాజం విశ్వాసం పెంచుకోవాలని కోరారు. భగత్ సింగ్ దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను అర్పించిన గొప్ప విప్లవ వీరుడు అన్నారు. అటువంటి విప్లవ వీరుడు ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు తెలుసుకొని వాటిని ఆచరించాలని యువతకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం బోనకల్ గ్రామ శాఖ కార్యదర్శి ఉప్పర్ల శ్రీను, పెద్ద బీరవల్లి ఉపసర్పంచ్ పెద్దపోలు రామారావు, వైరా, మధిర ఆటో అడ్డ అధ్యక్షులు నాగంటి బాబు, ఉపాధ్యక్షులు షేక్ సైదా, ట్రాన్స్పోర్ట్ యూనియన్ రాష్ట్ర నాయకులు పటాన్ గౌస్ నాయకులు పంది రాంబాబు, షేక్ సైదా, తెల్లబోయిన వీరయ్య, జగ్గయ్యపేట ఆటో అడ్డ అధ్యక్షులు తాళ్లూరి సుధాకర్, ఆటో కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -