Tuesday, March 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల అభివృద్ధి కోసం బడ్జెట్లో పెద్దపీట

పేదల అభివృద్ధి కోసం బడ్జెట్లో పెద్దపీట

- Advertisement -

మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి.
నవతెలంగాణ – వర్ధన్నపేట:

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం బడ్జెట్లో పెద్దపేట తెలిసిందని బిఆర్ఎస్ చేసిన ఆరోపణలు హాస్యాస్పదమని వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సార్ గా పని అన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి , వైస్ చైర్మన్ షిభారాణి లు మాట్లాడుతూ. అభివృద్ధి ముసుగులో గత ప్రభుత్వం మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి ,అప్పుల కుప్పగా మార్చిందన్నారు.
గత ప్రభుత్వం లో వర్ధన్నపేట పట్టణ కేంద్రం అభివృద్ధికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా, ఉన్నదన్నారు ఎవరు చేయని అభివృద్ధి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చేస్తున్నారన్నారు. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, సబ్ జైలు, మున్సిప్ కోర్టు , 100 పడకల ఆసుపత్రి, అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి ప్రోసిడింగ్ లెటర్లు ఇచ్చి పనులు మొదలు పెడుతున్నామన్నారు.గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిపై వర్ధన్నపేటలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నిండుగా ఉన్న కోణారెడ్డి చెరువును గతంలో గండి కొట్టి కాంట్రాక్ట్ పనుల కోసం కాలయాపన చేసింది బిఆర్ఎస్ కాదా అన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు చౌకబారు మాటలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో , పట్టణ అధ్యక్షులు మైస సురేష్,, పట్టణ కౌన్సిలర్లు, సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -