Tuesday, March 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంసీపీఎఫ్ నూతన కమిటీ మర్యాదపూర్వక భేటీలు

ఎంసీపీఎఫ్ నూతన కమిటీ మర్యాదపూర్వక భేటీలు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం : ఇటీవలే నూతనంగా ఎన్నికైన కాటారం సబ్ డివిజన్ ఎంసీపీఎఫ్ కమిటీ సభ్యులు స్థానిక ప్రముఖులను సోమవారం  మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కాటారం మాజీ ఎంపీపీ సమ్మయ్యను కలిసి ఆయనకు సన్మానం చేయగా, ఆయన కూడా నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. డివిజన్ పరిధిలో సేవకులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీ సభ్యులు వివరించగా, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని సమ్మయ్య హామీ ఇచ్చారు.

అలాగే కాటారం ఎస్‌ఐ శ్రీనివాస్‌ను కలిసి శాలువాతో సన్మానించిన కమిటీ సభ్యులు, చర్చిల వద్ద ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించారు. దీనిపై ఎస్‌ఐ శ్రీనివాస్ స్పందిస్తూ, అందరూ శాంతియుతంగా ఉండాలని, ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని, పాస్టర్లకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. కాటారం సీఐ నాగార్జునరావును కూడా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేసి, గ్రామాలలో సేవకులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ శాంతి భద్రతలను కాపాడాలని, అవసరమైతే పోలీస్ శాఖ సహాయం అందిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాలలో కమిటీ అధ్యక్షుడు అబ్రహం, ఉపాధ్యక్షుడు శామ్యూల్, ప్రధాన కార్యదర్శి కృపాకర్, కార్యదర్శి చందు, కోశాధికారి ఏకు సతీష్ కుమార్, కార్యవర్గ సభ్యులు రాజు నాయక్, జాన్, జక్కయ్య, సోషల్ మీడియా ఇన్‌చార్జి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -