Tuesday, March 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధిని భరించలేకే విమర్శలు...

అభివృద్ధిని భరించలేకే విమర్శలు…

- Advertisement -

రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి
నవతెలంగాణ – కాటారం :
మంథని నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను భరించలేకే కొందరు నేతలు నిరాధార ఆరోపణలకు పాల్పడుతున్నారని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి విమర్శించారు.
సోమవారం మండలంలోని గంగారం క్రాస్ వద్ద కాంగ్రెస్ మండల అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన  పాత్రికేయుల  సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మల్హర్ మండలం కొయ్యూరులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు విజయవంతం కావని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రభుత్వానికి బలమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని అన్నారు.ఈ కార్యక్రమం లో జాతీయ ఉపాధి హామీ  కౌన్సిల్ మెంబర్ దండ్రు రమేష్ , కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గద్దె సమ్మిరెడ్డి ,ఐత రాజిరెడ్డి, కిషన్ సెల్ జిల్లా అధ్యక్షులు వొన్న  వంశవర్ధన్ రావు, కొయ్యూరు సర్పంచి కొండ రాజమ్మ,  ఇప్పలపల్లి సర్పంచ్ అబ్బీనవేన  లింగస్వామి , బెల్లంకొండ సరిన్  రావు, ఎడ్లపల్లి సర్పంచ్ జంగిలి శ్రీనివాస్, మలహార్ రావు కాంగ్రెస్ మండల అధ్యక్షులు బడితేల  రాజయ్య , కుంభం రమేష్ రెడ్డి , కాటారం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కిషన్ నాయక్ , పిల్లమారి రమేష్ , రేగులగూడెం ఉప సర్పంచ్  పాలరపు వెంకటస్వామి,  పాగే  సురేష్, గంధం బాలరాజు పిల్లమరి నరేష్,  మొగిలి రాజ్ కుమార్,  కాంగ్రెస్ శ్రేణులు,  కాంగ్రెస్ అభిమానులు,  భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -