Tuesday, March 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిడిఎస్ బియ్యం పంపిణీపై సమీక్ష సమావేశం

పిడిఎస్ బియ్యం పంపిణీపై సమీక్ష సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం:- 

కాటారం మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఫెయిర్ ప్రైస్ (FP) షాప్ డీలర్లు, GPOలు, RI DTలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో డీలర్ల పాత్రపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
సమావేశంలో ముఖ్యంగా పిడిఎస్ బియ్యం పంపిణీ విధానం, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అధికారులు డీలర్లకు పలు సూచనలు జారీ చేశారు.
డీలర్లు వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా సేవలు అందించాలి, షాపులను నిర్ణీత సమయాలకు అనుగుణంగా నిర్వహించాలి, అనుమతిపత్రంలో పేర్కొన్న చిరునామా వద్దనే దుకాణం నిర్వహించాలి అని సూచించారు. అలాగే ప్రతి షాప్ ముందు నేమ్ బోర్డు, టైమ్ టేబుల్ తప్పనిసరిగా ప్రదర్శించాలి, స్టాక్ క్లోజింగ్ బ్యాలెన్స్‌ను సక్రమంగా నిర్వహించాలి అని ఆదేశించారు.
ఇకపై మూడు నెలల రేషన్ పంపిణీపై కూడా సమావేశంలో చర్చించి, అన్ని ఎఫ్‌పిఎస్ డీలర్లు ముందస్తుగా సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.}
ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -