- Advertisement -
క్రైస్ట్‌చర్చ్ : మహిళల క్రికెట్‌తో పాటు టీ20 ఫార్మాట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్‌జీసీ) సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ దేశవాళీ సర్క్యూట్‌లో ‘సూపర్ స్మాష్’ లీగ్ కొనసాగుతుండగా.. దీని స్థానంలో ఎన్‌జీ20 (న్యూజిలాండ్20) లీగ్‌ను ప్రవేశపెట్టేందుకు క్రికెట్ బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. డబ్ల్యూపీఎల్, బిగ్‌బాష్ తరహాలో ఎన్‌జీ20 పాపులర్ టీ20 లీగ్‌గా ఎదిగేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే క్రికెట్ బోర్డు కన్సల్టెన్సీ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది.
- Advertisement -



