Tuesday, March 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆరు గ్యారంటీలకు చట్టబద్ధత అవసరం

ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత అవసరం

- Advertisement -

ప్రయివేటు బిల్లును అనుమతించాలి
స్పీకర్‌కు ఎన్నారై బీఆర్‌ఎస్‌ నేతల విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలైనా ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నదని ఎన్నారై బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం లండన్‌లో నిర్వహించిన ఎన్నారై బీఆర్‌ఎస్‌ సెల్‌ సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టడానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు విజ్ఞప్తి చేశారు.

అత్యంత కీలకమైన ఈ బిల్లును ఆమోదిస్తే ప్రజలకు భరోసా లభిస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉందన్నారు. ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షులు నవీన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఇంకా ఎక్కువ రోజులు ప్రజలను మోసం చేస్తూ ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా తప్పించుకోలేదన్నారు. ఈ సమావేశంలో ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే నాయకులు అశోక్‌ గౌడ్‌ దూసరి, రత్నాకర్‌ కడుదుల, సిక్కా చంద్రశేఖర్‌ గౌడ్‌, సత్యమూర్తి చిలుముల, హరి గౌడ్‌ నవపేట్‌, రవి ప్రదీప్‌ పులుసు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -