రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సోషలిజం ద్వారానే సమసమాజం నిర్మితమవుతోందంటూ బలంగా నమ్మిన వీరకిశోరాలు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్ దేవ్ అని రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని జమిస్తాన్‌పూర్ ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో భగత్‌సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని వారి చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ సామ్రాజ్యవాదులు సాగిస్తున్నటువంటి వలస దోపిడీ, దేశాన్ని పట్టిపీడిస్తున్న దృశ్యాలను తట్టుకోలేక పార్లమెంటు పైన బాంబు విసిరారని గుర్తు చేశారు. దీంతో వారిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించిందని తెలిపారు. భారతదేశంలో సాగిస్తున్న మత ఘర్షణలు, సామాజిక, కుల పీడన వాటన్నిటి విషయంలో అనేక అధ్యయనాలు చేసి, వాటిపై పోరాడాలంటూ ఒక వీలునామాలో పేర్కొన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి మరియ్యాల గోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు మొక్కా సోమయ్య, నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సోషలిజాన్ని బలంగా నమ్మిన వీరకిశోరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



