Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్దళిత సమస్యల పరిష్కారం కోసమే పౌర హక్కుల దినోత్సవం..

దళిత సమస్యల పరిష్కారం కోసమే పౌర హక్కుల దినోత్సవం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి: దళిత వార్డుల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసమే పౌర హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నామని  కేసారం గ్రామ స్పెషల్ ఆఫీసర్ ప్రసాద్, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్ లు అన్నారు. శనివారం భువనగిరి మండలంలోని కేసారం గ్రామంలో జరిగిన పౌరహక్కుల దినోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు. కేసారం గ్రామంలో  బతుకమ్మ పండుగ సమయంలో దళితులపై వివక్ష కొనసాగుతోందని, గ్రామంలోని దళితుల ఇండ్ల పై వెళుతున్న  11 కే వి విద్యుత్ వైర్లను తొలగించాలన్నారు.  గ్రామంలో కుక్కల బెడద అధికంగా ఉందని , గ్రామంలో వ్యవసాయానికి అదనపు ట్రాన్స్ ఫారం కావాలని గ్రామస్తులు  పౌర హక్కుల దినోత్సవం లో పిర్యాదు చేశారు. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి తెస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ బలరామ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రమాదేవి, సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి రమేష్, హెచ్ డబ్ల్యూ ఓ ఆనంద్, మాజీ వార్డు సభ్యులు కాశపాక జ్యోతి,కాశపాక మహేష్, వెంకటేశం, ఎం ఎన్ ఎం, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad