Tuesday, March 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబడ్జెట్‌లో 'సీతారామ'కు అవసరమైన నిధులు కేటాయించాలి

బడ్జెట్‌లో ‘సీతారామ’కు అవసరమైన నిధులు కేటాయించాలి

- Advertisement -

రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ-కామేపల్లి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే సామర్థ్యం ఉన్న సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన 11 వేల కోట్ల రూపాయల నిధులను 2026-27 ఆర్థిక బడ్జెట్‌లో కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కామేపల్లిలోని కొత్త లింగాల క్రాస్‌ రోడ్డు వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి నిధులు కేటాయింపులు తక్కువ చేయడం, సీతారామ ప్రాజెక్టుకు కేవలం 336 కోట్ల రూపాయలు కేటాయించడం దారుణమన్నారు. సీతారామ ప్రాజెక్టు కాలువ భూ నిర్వాసితులకు పరిహారం అందించాలని, ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇంకా నిధులు అవసరమవుతాయని తెలిపారు.

దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నీటి పారుదల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.11 వేల కోట్లు అంచనా వేసి రాష్ట్ర బడ్జెట్‌లో మాత్రం గతేడాది (రూ.699 కోట్లు) కంటే ఈ ఏడాది కేవలం రూ.336 కోట్లు కేటాయించడంపై ప్రభుత్వం చిత్తశుద్ధి అర్థమవుతోందన్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనలు సవరించి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయింపులు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సినీయర్‌ నాయకులు ఇంజం నాగభూషణం, అంబటి శ్రీనివాస్‌ రెడ్డి, బాదావత్‌ శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు రాయల సత్యనారాయణ, కార్యదర్శి సకినాల శ్రీనివాసరావు, నిర్వాసితుల సంఘం నాయకులు షేక్‌ షరిఫ్‌, అర్జ రమేష్‌, గడ్డం వీరన్న, వెంకట్రామిరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, సింగం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -