Tuesday, March 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుశ్రీధరన్న దండం పెడతా.. నాపై పగ వద్దు: మల్లారెడ్డి

శ్రీధరన్న దండం పెడతా.. నాపై పగ వద్దు: మల్లారెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. “ఇంఛార్జ్ మంత్రిగా నా మిత్రుడు శ్రీధర్ బాబు వచ్చాడని ఎంతో సంతోషించాను. కానీ ఇప్పుడు బాధపడుతున్నాను. నా గుండెకాయ లాంటి జవహర్ నగర్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేసి చెత్త కుప్పగా మార్చేశారు. కంపు కొడుతున్న జనహర్ నగర్‌ను చూసి బాధపడుతున్న. నా ప్రజలు బాధను భరించలేకపోతున్న. ఎందుకు గెలిచానా అనిపిస్తోంది. శ్రీధరన్నకు దండం పెడతా.. నాపై పగ వద్దు. నా నియోజకవర్గంలో చెత్తను క్లీన్ చేయడానికి స్పెషల్ ప్యాకేజీ కింద రూ.వెయ్యి కోట్లు ఇవ్వండి” అని మల్లారెడ్డి కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -