Tuesday, March 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలు లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

 లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్ స్టాక్ లలో బలమైన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రోజంతా సానుకూలంగా కదిలి, గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,372.06 పాయింట్లు పెరిగి 74,068.45 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 399.75 పాయింట్లు లాభపడి 22,912.40 వద్ద ముగిసింది.

అమెరికా, ఇరాన్ మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టవచ్చన్న ఆశలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపాయి. దీంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడిందని విశ్లేషకులు తెలిపారు. ప్రధాన సూచీలతో పాటు బ్రాడర్ మార్కెట్లు కూడా రాణించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.60 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2.63 శాతం చొప్పున లాభపడ్డాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -